
చంద్రబాబు నాయుడు ఏనాడూ ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సముచిత స్థానం కల్పించిన పాపానపోలేదు. జేసీ ప్రభాకర్‌రెడ్డి మున్సిపల్ ఎన్నికల ముందు సేవ్ తాడిపత్రి అని మొసలి కన్నీరు కార్చారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారికి పదవులు ఇస్తానని చెప్పి గెలిచారు. విజయం సాధించాక నమ్మిన వారిని వంచించారు. తినే తిండి నుంచి కట్టేబట్ట వరకు ప్రజల నుంచే దోచుకుంటున్నారు. తాడిపత్రిలో 20 షాపురూములను బినామీలకు కట్టబెట్టి బాడుగల ద్వారా బతికేస్తున్నారు. తాడిపత్రిలో ఏ అభివృద్ధి పని చేపట్టినా అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారు. జూనియర్ కళాశాల గ్రౌండ్ ప్రహరీ నిర్మాణ పనులతో పాటు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పనులను అడ్డుకున్నారు. బీసీలు, మైనార్టీలకు ఆంజనేయస్వామి మాన్యంలో 750 పట్టాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తే అడ్డు తగిలారు. తాడిపత్రికి గతంలో వంద పడకల ఆసుపత్రి మంజూరైతే జేసీ దివాకర్‌రెడ్డి రద్దు చేయించారు. నేడు నేను ఆస్పత్రి నిర్మాణ పనులు చేయిస్తుంటే, కాంట్రాక్టర్, ఇతర కార్మికులను బెదిరిస్తున్నారు. ఇలాంటి లుచ్చాలు ప్రజాప్రతినిధులైతే తాడిపత్రి ఎలా అభివృద్ధి చెందుతుందో ప్రజలు ఆలోచించుకోవాలి.
– ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, తాడిపత్రి
జేసీ సోదరులను నమ్మొద్దు
దుష్టులైన జేసీ సోదరులను నమ్మితే జీవితాలను చేజేతులా నాశనం చేసుకున్నవారవుతారు. వైఎస్సార్ సీపీని మరో సారి గెలిపిస్తేనే తాడిపత్రి అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. జీవితాలు బాగుపడతాయి. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ ఇలా అన్ని వర్గాల ప్రజల కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా నిలుద్దాం. –పైలా నరసింహయ్య,
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
బీసీలకు సముచిత స్థానం
దేశంలో ఎక్కడాలేని విధంగా బీసీలకు రాజకీయ పదవులు ఈ ప్రభుత్వంలో లభించాయి. 50 శాతానికి పైగా పదవులను బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు సీఎం జగన్ కట్టబెట్టారు. 2019కి ముందు తాడిపత్రిలో రాక్షస పాలన కొనసాగింది. నేడు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో జేసీ కుటుంబానికి ప్రజలే రాజకీయ సమాధి కట్టాలి.
– హరీష్ యాదవ్,
యాదవ కార్పొరేషన్ చైర్మన్


Comments
Please login to add a commentAdd a comment