అమ్మ పద్మ టైలర్. నాన్న యల్లప్ప బేల్దారి. వారు ఎంతో కష్టపడి నన్ను బీటెక్ చదివించారు. వారు పంపే డబ్బులు సరిపోకపోవడంతో కళ్యాణదుర్గానికి చెందిన మనోహర్, అతని తల్లిదండ్రులు రామకృష్ణ, తిప్పమ్మ ఆర్థికసాయం అందజేశారు. ఈఈఈ విభాగం అధ్యాపకులు శ్రీలక్ష్మి, శ్యాంసుందర్, శంకర్ ప్రోత్సాహం మరువలేనిది. తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చడమే లక్ష్యంగా చదివాను. అనుకున్నది సాధించాను. ఇక నుంచి అమ్మానాన్నలను సుఖంగా ఉండేలా చూసుకోవడమే నా బాధ్యతగా భావిస్తున్నాను. దివి ల్యాబొరేటరీస్‌లో ఉద్యోగం వచ్చింది. అయితే ఇంటర్మీడియెట్ చదివే సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో చేతికి రాడ్లు వేశారు. ఆ కారణంగా మెడికల్ టెస్ట్‌లో రిజెక్ట్ అయ్యాను. ప్రస్తుతం చేతిలో ఉన్న రాడ్లు తొలగించడానికి ఆర్థిక ఇబ్బంది ఉంది. రాడ్లు తొలగించాక.. ఉద్యోగంలో చేరతాను.
– ఇంద్ర, బీటెక్–ఈఈఈ, గుంతకల్లు


