● మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా డాక్టర్ టెస్సీ థామస్
అనంతపురం: శాస్త్రవేత్తల అలుపెరుగని కృషి, కఠోర శ్రమతోనే అంతరిక్ష, రక్షణ, అణు సాంకేతిక రంగాల్లో అగ్రశ్రేణి దేశాల సరసన భారత్ నిలిచిందని మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా డాక్టర్ టెస్సీ థామస్ అన్నారు. జేఎన్‌టీయూ 15వ స్నాతకోత్సవం సందర్భంగా టెస్సీ థామస్‌కు గౌరవ డాక్టరేట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అగ్ని–1 నుంచి అగ్ని –5 క్షిపణి వరకు రక్షణ రంగంలో స్వావలంబన సాధించామని చెప్పడానికి గర్వంగా ఉందన్నారు. దేశ సేవలో అంకితభావం, నిరంతర అభ్యాసనం, పట్టుదల గెలుపునకు నిదర్శనంగా భావిస్తానన్నారు. క్షిపణి రూపకల్పనలో ప్రతి పరీక్ష విజయవంతం కాదని, కానీ వైఫల్యం ఒక అనుభవం, అవగాహన, సరైన దిశను అందిస్తుందని అన్నారు. నూతన ఆవిష్కరణలు ప్రయోగశాలకే పరిమితమయ్యే రోజుల నుంచి స్టార్టప్, గ్రామాలు, తరగతి గదులు, డిజిటల్ వేదికలపై వికసిస్తుండడం గర్వకారణంగా భావిస్తున్నానన్నారు.


