నిషేధిత జాబితా నుంచి పలు భూముల తొలగింపు | - | Sakshi
Sakshi News home page

నిషేధిత జాబితా నుంచి పలు భూముల తొలగింపు

Oct 6 2026 12:36 AM | Updated on Oct 6 2026 12:36 AM

తుమ్మపాల : జిల్లాలో నిషేధిత జాబితాలో నమోదై ఉన్న ఐదు మండలాలకు చెందిన భూములకు విముక్తి లభించింది. కలెక్టర్‌ ఆదేశాలతో కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా పరవాడ, అచ్యుతాపురం, నక్కపల్లి, నర్సీపట్నం, కోటపాడు మండలాల్లోని పలు భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను కలెక్టరేట్‌లో సోమవారం జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌ పటేల్‌, డీఆర్‌వో సత్యనారాయణరావు లబ్ధిదారులకు అందించారు. పరవాడ మండలం దేసపాత్రునిపాలెంలో 2.31 సెంట్లు, అచ్యుతాపురం మండలం ఇరువాడలో 5.76 సెంట్లు, నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లులో 2.03 సెంట్లు, నర్సీపట్నం మండలం బలిఘట్టంలో 1.05 సెంట్లు, కోటపాడు మండలం గవరపాలెంలో 0.85 సెంట్లు మొత్తం 16 ఎకరాలకు పైగా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. సంబంధిత మార్పులు రిజిస్ట్రేషన్‌ రికార్డుల్లో అమలు చేయడానికి జిల్లా రిజిస్ట్రార్‌కు ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement