ఎస్పీ తుహిన్ సిన్హాను మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్‌బీ డీఎస్పీ వి.బాజ్జీరావు
అనకాపల్లి : అనకాపల్లి జిల్లా స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా వి.బాబ్జీరావు సోమవారం బాధ్యతలను ఎస్పీ తుహిన్ సిన్హా కార్యాలయంలో స్వీకరించారు. అంతకుముందు ఎస్పీ తుహిన్ సిన్హాను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్బంగా డీఎస్పీ మాట్లాడుతూ 1995లో పోలీస్‌శాఖలో ఎస్‌ఐగా విధులు నిర్వహించి, విశాఖ ఉమ్మడి జిల్లాలో వివిధ పోలీస్‌స్టేషన్‌ల్లో ఎస్‌ఐ, సీఐగా పనిచేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం సీఐడీ విభాగంలో పనిచేసి డీఎస్పీగా పదోన్నతిపై అనకాపల్లి జిల్లా ఎస్‌బీగా రావడం జరిగిందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు స్పెషల్ బ్రాంచి విభాగం గుండెకాయ వంటిదన్నారు. సమస్యాత్మక ప్రాంతాలు, సంఘటనలపై ముందస్తు సమాచారాన్ని (ఇంటెలిజెన్స్) ఎప్పటికప్పుడు సేకరించి అప్రమత్తం చేయడంలో ఎస్‌బీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి జిల్లాలో ప్రశాంతమైన వాతావారణంలో ఉండే విధంగా కృషి చేస్తామన్నారు.


