నర్సీపట్నం : నర్సీపట్నం రేంజర్‌గా సోమవారం వెంకటరావు బాధ్యతలు స్వీకరించారు. అల్లూరి జిల్లా సీలేరు రేంజర్‌గా పని చేస్తున్న వెంకటరావును నర్సీపట్నం రేంజర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నర్సీపట్నం రేంజర్ రాజేష్‌ను అల్లూరి జిల్లా లంబసింగికి బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన వెంకటరావును సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలియజేశారు. అటవీ సంపద పరిరక్షణకు కృషి చేస్తానని తనను కలిసిన విలేకర్లకు ఆయన తెలిపారు. అడవుల ఆవశ్యకత గురించి ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు.


