రాష్ట్రస్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో పతకాల పంట | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో పతకాల పంట

Oct 6 2026 12:36 AM | Updated on Oct 6 2026 12:36 AM

పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో వివిధ విభాగాల్లో పతకాలు సాధించిన క్రీడాకారులతో బద్రినాథ్‌

అనకాపల్లి : ఈనెల 3, 4 తేదీల్లో ఎన్టీఆర్‌ జిల్లా తిరుపూరు గ్రామంలో రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌, జూనియర్‌, సీనియర్‌ మాస్టర్స్‌ సీ్త్ర పురుషుల పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో జిల్లా క్రీడాకారులు పతకాలు సాధించినట్టు ఎస్‌ఎస్‌ఎస్‌ జిమ్‌ వ్యవస్థాపకుడు బద్రి సోమవారం చెప్పారు. సబ్‌ జూనియర్‌ విభాగంలో ఐ.గౌతమి స్విలర్‌ మెడల్‌, జూనియర్‌ విభాగంలో పి.యోగేంద్రకుమార్‌, కె.ప్రవల్లికలు గోల్డ్‌ మెడల్‌, సీనియర్‌ విభాగంలో ఎస్‌.గౌతమ్‌, ఎ.గణేష్‌ గోల్డ్‌ మెడల్‌, మాస్టర్‌ విభాగంలో జి.ఎల్‌వి.నాగరాజు, ఎ.గణేష్‌, బి.వి.రామకృష్ణ గోల్డ్‌ మెడల్‌, కె.శ్రీనివాస్‌ కాంస్య పతకాలు సాధించారు. టీం ఛాంపియన్‌షిప్‌ రాష్ట్రంలో మూడో స్థానం అనకాపల్లి జిల్లాకు రావడం జరిగిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement