జాతీయ కరాటే పోటీల్లో సత్తా చాటిన
విద్యార్థులతో కోచ్ శివ
మునగపాక : మండలంలోని నారాయుడుపాలెం గ్రామానికి చెందిన అన్నపూర్ణ కరాటే అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయి కరాటే చాంపియన్‌షిప్ పోటీల్లో సత్తా చాటారు. ఈ నెల 4వ తేదీన కొత్తవలసలో నిర్వహించిన జాతీయ కరాటే పోటీల్లో అన్నపూర్ణ కరాటే అకాడమీ విద్యార్థులు పలు పతకాలు సాధించినట్టు కోచ్ శివ తెలిపారు. వి.ఇంద్రకుమార్ బ్లాక్‌బెల్ట్, వి.దుర్గా, యు.విశాల్, ఈ.జ్యోతి స్వరూప్, పి.నానాజీలు బంగారు పతకాలు సాధించారు. ఎ.లహరి, రజి, ఈశ్వర్, వాసంతి, యోగి తదితరులు కాంస్య పతకాలు సాధించినట్టు తెలిపారు.


