రాష్ట్ర స్థాయి జూడో, వెయిట్‌లిఫ్టింగ్ పోటీలకు ఎంపికై న విద్యార్థులను అభినందిస్తున్న హెచ్‌ఎం ప్రసాద్
కశింకోట: స్థానిక డీపీఎన్ జెడ్పీ హైస్కూలుకి చెందిన ముగ్గురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి జూడో, వెయిట్‌లిఫ్టింగ్ పోటీలకు ఎంపికయ్యారు. కొమ్మాదిలో జరిగిన ఉమ్మడి విశాఖ జిల్లా స్థాయి పోటీల్లో జూడోలో ఈ పాఠశాలకు చెందిన ఎస్.పవన్, జె. వినయ్‌కుమార్ ఎంపిక కాగా, అరకులో జరిగిన వెయిట్‌లిఫ్టింగ్ పోటీలో బొండా ప్రవీణ్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరికి హెచ్‌ఎం ప్రసాద్, విద్యా కమిటీ ప్రతినిధులు, పీఈటీలు వి. ప్రభాకరరావు, పెంటకోట కమల, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.


