ఎంపికై న విద్యార్థులతో హెచ్‌ఎం సరోజిని, చైర్మన్ రాజేష్ తదితరులు
నర్సీపట్నం: ఉమ్మడి జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీల్లో చెట్టుపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. రెజ్లింగ్ పోటీల్లో బి.యశ్వంత్, ఎం.మహీధర్, టి.గౌతమ్(9వ తరగతి), రోషిణి(7వ తరగతి) ఈ నెల 10, 11, 12 తేదీల్లో పల్నాడు జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనున్నారు. వెయిట్ లిప్టింగ్ పోటీల్లో టి.లక్ష్మి(7వ తరగతి), కె.భవ్య(8వ తరగతి), ఎం.అమృతవల్లీ(9వ తరగతి) కాకినాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయిని గుడివాడ దేవిని హెచ్‌ఎం వి.సరోజిని, చైర్మన్ బి.రాజేష్, వైస్ చైర్మన్ నానాజీ, ఉపాధ్యాయులు అభినందించారు.


