యువ క్రీడాకారులకు ఉపయుక్తంగా ఇండోర్‌ స్టేడియం | - | Sakshi
Sakshi News home page

యువ క్రీడాకారులకు ఉపయుక్తంగా ఇండోర్‌ స్టేడియం

Oct 6 2026 12:36 AM | Updated on Oct 6 2026 12:36 AM

అనకాపల్లి : యువత క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఇండోర్‌ స్టేడియం ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అన్నారు. స్థానిక గవరపాలెం ఇండోర్‌ స్టేడియంను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు, యువత ఈ ఇండోర్‌ స్టేడియంను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ మాట్లాడుతూ క్రీడా సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడంలో రాజీవ్‌గాంధీ ఇండోర్‌ స్టేడియం కీలకంగా నిలుస్తుందన్నారు. సీఎస్‌ఆర్‌ రూ.2కోట్ల నిధులతో స్టేడియంను అభివృద్ధి చేశామన్నారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ఎన్‌టీపీసీ సింహాద్రీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అయస్కాంత్‌ జెనా, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement