రాంబిల్లి : ఐనాక్స్ ఎయిర్ కంపెనీని సోమవారం పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దాదాపు 200 కోట్ల రూపాయలతో 6 ఎకరాల విస్తీర్ణంలో ఐనాక్స్ కంపెనీ ఏర్పాటైందన్నారు. కరోనా కాలంలో ఐనాక్స్ కంపెనీ ఆక్సిజన్ అందించి వేలాది మంది ప్రాణాలను కాపాడిందన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభుత్వం నుంచి భూములు తీసుకొని పరిశ్రమలు ఏర్పాటు చేయకపోతే సంబంధిత యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చి ఆయా భూములను స్వాధీనం చేసుకుంటామన్నారు. ఎమ్మెల్యే విజయ్‌కుమార్, రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.


