నకిలీపత్రాలతో మోసగించిన కేసులో ఇద్దరి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

నకిలీపత్రాలతో మోసగించిన కేసులో ఇద్దరి అరెస్టు

Oct 6 2026 12:36 AM | Updated on Oct 6 2026 12:36 AM

కశింకోట: నకిలీ పత్రాలతో ప్రభుత్వ సంస్థలను, బాధితున్ని మోసగించారనే అభియోగంపై ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టు సీఐ అల్లు స్వామినాయుడు సోమవారం రాత్రి తెలిపారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒక స్థల వివాదానికి సంబంధించి కోర్టు నుంచి అందిన ఎండార్స్‌మెంట్‌ పిటీషన్‌పై సమగ్ర దర్యాప్తు చేపట్టామన్నారు. దీనిలో భాగంగా జిల్లా రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు, తహసీల్దార్‌ కార్యాలయం అధికారులు, కశింకోట పంచాయతీ కార్యాలయ అధికారులు, ఇతర ముఖ్య సాక్షులనుక్షుణ్ణంగా విచారించామన్నారు. సంబంధిత పత్రాలను పరిశీలించి నకిలీ, ఫోర్జరీ పత్రాలను ఉపయోగించి బాధితుడ్ని, ప్రభుత్వ సంస్థలను మోసగించినట్లు ప్రాథమికంగా నిర్థారించి స్థానికులైన ప్రధాన నిందితులు పెంటకోట నాయుడు, పెంటకోట సత్యనారాయణలను అరెస్టు చేసినట్టు తెలిపారు. వీరిని కోర్టులో హాజరుపర్చగా మేజిస్ట్రేట్‌ నిందితులకు 12 రోజులు జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించారన్నారు. సీఐ పర్యవేక్షణలో ఎస్‌ఐ కె. లక్ష్మణరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement