గంజాయి కేసుల్లో పట్టుబడితే పీడీ యాక్ట్‌ | - | Sakshi
Sakshi News home page

గంజాయి కేసుల్లో పట్టుబడితే పీడీ యాక్ట్‌

Oct 6 2026 12:36 AM | Updated on Oct 6 2026 12:36 AM

● పాత నేరస్తుడు అరెస్టు

నర్సీపట్నం/గొలుగొండ: పదే పదే గంజాయి కేసుల్లో పట్టుబడితే పీడీ యాక్ట్‌ ప్రయోగిస్తామని రూరల్‌ సీఐ ఎల్‌.రేవతమ్మ హెచ్చరించారు. ఎన్‌డీపీఎస్‌ చట్ట కింద నర్సీపట్నం రూరల్‌ పోలీసులు సోమవారం అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్‌ను అరెస్ట్‌ చేశారు. సీఐ అందించిన వివరాల ప్రకారం.. డీఎస్పీ పి.శ్రీనివాసరావు పర్యవేక్షణలో గొలుగొండ మండలం పాత కేడీపేట గ్రామానికి చెందిన ఉప్పాటి వెంకటేష్‌(23) అల్లూరి జిల్లాలో గంజాయి కొనుగోలు చేసి విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నాడు. ఇతనిపై గతంలో పలు పోలీస్‌ స్టేషన్లలో 4 గంజాయి కేసులు ఉన్నాయి. కేడీపేట 1 కేసు, కాకినాడ జిల్లా ఏలేశ్వరం పోలీసు స్టేషన్‌–2, అదే జిల్లా అన్నవరం పోలీసు స్టేషన్‌ –1 కేసు చొప్పున ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎస్పీ తుహిన్‌ సిన్హా ఆదేశాల మేరకు సీఐ రేవతమ్మ, ఎన్‌డీపీఎస్‌ సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ పిల్లా రమేష్‌, కేడీపేట ఎస్సై రుషికేశ్వరరావు, సిబ్బంది నిందితుడిని అరెస్ట్‌ చేసి విశాఖ సెంట్రల్‌ జైలుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement