యలమంచిలి యువకుడికి నటుడు జగపతిబాబు ప్రశంస | - | Sakshi
Sakshi News home page

యలమంచిలి యువకుడికి నటుడు జగపతిబాబు ప్రశంస

Oct 6 2026 12:36 AM | Updated on Oct 6 2026 12:36 AM

యలమంచిలి రూరల్‌: తాను నటించిన పెదబాబు చిత్రంలో ‘నవ్వవయ్య బాబూ..నీ సొమ్మేం పోయింది నీ సోకేం పోయింది’ పాటకు అదిరే స్టెప్పులతో డాన్స్‌ చేసిన యువకుడ్ని నటుడు జగపతిబాబు ప్రశంసించారు. నా డాన్స్‌ని కూడా ఇమిటేట్‌ చేయగలిగినవాడున్నాడు అన్నమాట గొప్పోడివయ్యా అంటూ తన ఇన్‌స్టా అకౌంట్‌ జగ్గూభాయ్‌ ద్వారా యువకుడికి కామెంట్‌ పంపించారు. జగపతిబాబుతో పాటు జబర్దస్త్‌ కమేడియన్‌ అదిరే అభి కూడా యువకుడు పట్నాల రమణను అభినందిస్తూ పోస్ట్‌ చేశారు. ఈ కామెంట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. తన డాన్స్‌తో ఉన్న వీడియో పోస్టు చేసిన ఇన్‌ స్ట్రాగామ్‌ ఖాతాకు ఇప్పటి వరకు 8 లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయని రమణ తెలిపాడు. ఇటీవల తమ వీధిలో వినాయక నవరాత్రుల సందర్భంగా తాను స్టేజీపై చేసిన డాన్స్‌ను వీడియోగా చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసినట్టు చెప్పాడు.వీడియో బాగా వైరల్‌ కావడం,నటుడు జగపతిబాబు ప్రశంసించడం పట్ల రమణ సంతోషం వ్యక్తం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement