విద్యార్ధులకు బస్సు సౌకర్యం కల్పించాలనిపీడీఎస్‌ఓ జిల్లా కమిటీ నిరసన
పట్టణ, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద పీడీఎస్‌వో జిల్లా కమిటీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్‌వో జిల్లా కార్యదర్శి ఎస్.రుద్రి మాట్లాడుతూ బస్సుల్లో రద్దీ కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోందన్నారు. గతంలో నిలిపివేసిన బస్సులను పునరుద్ధరించడంతో పాటు కొత్త బస్సులు ఏర్పాటు చేయాలని కోరారు.
చోడవరం–కోనాం, చోడవరం–అనకాపల్లి, చోడవరం–మాడుగుల, చోడవరం–రావికమతం, అనకాపల్లి–నర్సీపట్నం, యలమంచిలి–వెంకటాపురం, యలమంచిలి–బంగారంపాలెం రూట్లలో అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని పీడీఎస్‌వో జిల్లా ఉపాధ్యక్షుడు కె.మణికుమార్ కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే కలెక్టరేట్ వద్ద విద్యార్థులతో నిరసన చేపడతామని తెలిపారు.


