రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు శ్రీప్రకాష్‌ విద్యార్థుల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు శ్రీప్రకాష్‌ విద్యార్థుల ఎంపిక

Oct 6 2026 12:36 AM | Updated on Oct 6 2026 12:36 AM

క్రీడాకారులతో ప్రిన్సిపాల్‌ భానుమూర్తి

పాయకరావుపేట: రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన విద్యార్థులను శ్రీప్రకాష్‌ విద్యా సంస్థల అధినేత సి.హెచ్‌.వి.కె. నరసింహారావు, సంయుక్త కార్యదర్శి సీహెచ్‌.విజయ్‌ప్రకాష్‌ అభినందించారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గాంధీనగరంలో జరిగిన కబడ్డీ పోటీల్లో విద్యార్థులు పి. శివాజీ, పి.హేమంత్‌, ఎం.ప్రవీణ్‌కుమార్‌ ప్రతిభ చూపారు. కృష్ణా జిల్లా నూజివీడులో ఈ నెల 11 నుంచి 13 వరకు జరిగే రాష్ట్ర పోటీలు పాల్గొంటారని ప్రిన్సిపాల్‌ భాను మూర్తి తెలిపారు. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో కృష్ణాపురంలో జరిగిన అండర్‌ –17 జిల్లా స్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీల్లో ఆర్‌.నవీన్‌, రిషిరాజ్‌ ప్రతిభ చూపారు. వీరు ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు తెనాలిలో జరిగే రాష్ట్ర పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement