రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలకు ఎంపిక

Oct 5 2026 12:33 AM | Updated on Oct 5 2026 12:33 AM

కశింకోట: కశింకోటలోని డీపీఎన్‌జెడ్పీ హైస్కూలుకి చెందిన ఐదుగురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలకు ఎంపికయ్యారు. కొయ్యూరులో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి పోటీలో ఇక్కడి పాఠశాల నుంచి ఫ్రీ స్టయిల్‌ విభాగంలో డి. లోకేష్‌, జి. హరనాథ్‌, గ్రీకో రోమన్‌ విభాగంలో ఎ. స్వరూప్‌, జి. భరత్‌కుమార్‌, జి.చందులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారని హెచ్‌ఎం ఎన్‌.జె.వి ప్రసాద్‌ తెలిపారు. వీరు ఈ నెల 10,11 తేదీల్లో పల్నాడులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొంటారని తెలిపారు. వీరిని ఆయనతోపాటు వ్యాయామ ఉపాధ్యాయులు వి.ప్రభాకరరావు, పెంటకోట కమల, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్య కమిటీ ప్రతినిధులు అభినందించారు. వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో...

నర్సీపట్నం: మున్సిపాలిటీ పరిధి బలిఘట్టం జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న మందడపు నాగశ్రీ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన వెయిట్‌ లిప్టింగ్‌ పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై ంది. ఈ నెల 9,10,11 తేదీల్లో కాకినాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థిని పాల్గొంటుంది. క్రీడాకారిణి నాగశ్రీ, వ్యాయామ ఉపాధ్యాయుడు నాగేశ్వరరావును పాఠశాల హెచ్‌ఎం శ్రీదేవి, ఉపాధ్యాయులు ఐ.శ్రీనివాసరావు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement