11న ఉత్తరాంధ్ర బహుజన ఉద్యోగుల న్యాయభేరి | - | Sakshi
Sakshi News home page

11న ఉత్తరాంధ్ర బహుజన ఉద్యోగుల న్యాయభేరి

Oct 5 2026 12:33 AM | Updated on Oct 5 2026 12:33 AM

అనకాపల్లి: ఉత్తరాంధ్ర జిల్లా బహుజన ఉద్యోగుల ఆధ్వర్యంలో ఈనెల 11న న్యాయభేరి బహిరంగ సభ తుమ్మపాల పంచాయతీ ఏలేరు కాలువ వద్ద కల్యాణి వెంకటేశ్వర ఫంక్షన్‌ హాల్లో నిర్వహించడం జరుగుతుందని రిజర్వేషన్‌ పరిరక్షణ సమితి రాష్ట్ర యూత్‌ కన్వీనర్‌ శేఖర్‌, జిల్లా వర్కింగ్‌ అధ్యక్షుడు బోయిన చిన్నారావు అన్నారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ రహ దారి సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం కరప త్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ, న్యాయ వ్యవస్థలో రిజర్వేషన్లు అమలు, ప్రభుత్వ ఉద్యోగాలలో చట్టం అమలు చట్టసభలలో బీసీలకు 44శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని, పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు క్యాప్టివ్‌ గనులను కేటాయించి ప్రైవేటీకరణ అపాలని, 1/70 చట్టాలను కఠినంగా అమలు చేయాలని కోరుతున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement