ఎంపికై న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులు
నర్సీపట్నం : ఉమ్మడి జిల్లాల స్కూల్ గేమ్స్ రెజ్లింగ్ సెలెక్షన్ పోటీలు శనివారం అల్లూరి జల్లా కొయ్యూరు ఆశ్రమ స్కూల్‌లో జరిగాయి. పోటీల్లో ప్రతిభ కనబరిచిన జెడ్పీ హైస్కూల్ నుంచి మద్దిల కావ్య, సియాద్రి త్రివేణి, ఉపాటి మహాలక్ష్మి, వంతల నల్లి, జెడ్పీ బాలికల హైస్కూల్ నుంచి సకిరెడ్డి హరిణి, గవర్నమెంట్ హైస్కూల్ నుంచి నిహాల్ మొదటి స్థానంలో నిలిచారు. వీరంతా ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు పల్నాడు జిల్లాలో జరి గే రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీల్లో పాల్గొంటారని శాప్ కోచ్ అబ్బు తెలిపారు.


