నాకు, మా అన్నయ్య, పెదనాన్నకు ఐదెకరాలు జిరాయితీ భూమి ఉంది. వర్షాలు పడితే వరి లేకుండా పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాం. మా భూమికి 500 మీటర్ల దూరంలో మైనింగ్‌కు అనుమతిలిచ్చారు. కనీసం మా అభిప్రాయం తీసుకోలేదు. ఇక్కడ మైనింగ్ జరిగితే మా పొలంలో పంట నాశనం అయిపోతుంది. గ్రామానికి 500 మీటర్ల దూరంలోనే మైనింగ్ అనుమతిస్తే మా గ్రామ ప్రజలు శ్వాసకోశ వ్యాధుల బారిన పడతారు. దీనిపై పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశాం.
– కామిరెడ్డి వెంకట కృష్ణ, రైతు, పి.కొత్తపల్లి గ్రామం


