నర్సీపట్నం: రైతాంగానికి నష్టం కలిగించే మైనింగ్ లీజులను రద్దు చేయాలని వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన కోటవురట్ల మండలం, పిప్పళ్ల కొత్తపల్లి రైతులకు నిరాస ఎదురవడంతో కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలియజేసారు. గ్రామానికి 500 మీటర్ల దూరంలో ఉన్న కొండ సర్వే నెంబరు 190లో విస్తీర్ణం 285 ఎకరాలు కలిగి ఉంది. చాలా మంది పేదలకు డి–ఫారం పట్టా ఇచ్చారు. పొడి వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నారని ఆ గ్రామానికి చెందిన కామిరెడ్డి స్వామినాయుడు, సింగంపల్లి రమేష్; రొంగల వెంకట రమణ, పైల వీరాస్వామి పేర్కొన్నారు. వినతిపత్రం తీసుకునేందుకు మైనింగ్ అధికారులు నిరాకరించడం దారుణం అన్నారు. కార్యాలయం బోర్డు వద్ద బైఠాయించి నిరసన తెలియజేసామని పేర్కొన్నారు. కొంత మంది దళారులు, రాజకీయ నాయకులు కుమ్మకై ్క కొండను వ్యాపారంగా మార్చుకొని అక్కడ ఉన్న మెటల్ రాయిని తవ్వి రూ.కోట్లు కొల్లగొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే మైనింగ్‌ను నిలుపుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


