ఎస్పీ కార్యాలయంలో... | - | Sakshi
Sakshi News home page

ఎస్పీ కార్యాలయంలో...

Jun 2 2026 3:00 AM | Updated on Jun 2 2026 3:00 AM

అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్‌కు 52 అర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్‌ సిన్హా అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్ట పరిధిలో సమస్యలను వారం రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. భూ తగాదాలు, మోసపూరిత హామీలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, ఇతర సమస్యలపై అర్జీలు వచ్చాయన్నారు. చట్టపరిధిలో అర్జీలను పరిష్కరించే విధంగా దిగువ స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఎల్‌.మోహన్‌రావు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement