నాతవరం: గుడ్ గవర్నెర్స్ విభాగంలో జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డుకు ఎంపికై న నాతవరం మండలంలో శృంగవరం పంచాయతీకి ఆహ్వానం అందింది. ఈ నెల 3వ తేదీన ఢిల్లీలో కార్యక్రమానికి హాజరు కావాలని జిల్లా పంచాయతీ అధికారి సందీప్‌తోపాటు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌లకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం వచ్చింది. ఈ మేరకు మంగళవారం ఉదయం వారిద్దరు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ పంచాయతీ తరపున జాతీయ అవార్డుతో కోటి రూపాయలు అందుకోనున్నారు. ఉమ్మడి జిల్లాలోనే శృంగవరం పంచాయతీకి జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందని డీపీవో తెలిపారు.


