జేఈఈ అడ్వాన్స్‌లో మెరుపులు | - | Sakshi
Sakshi News home page

జేఈఈ అడ్వాన్స్‌లో మెరుపులు

Jun 2 2026 3:00 AM | Updated on Jun 2 2026 3:00 AM

నర్సీపట్నం : జేఈఈ మెయిన్స్‌లో నర్సీపట్నం కారుణ్య కళాశాలకు చెందిన విద్యార్థి కాకినాడ దివాకర్‌ అఖిల భారతస్థాయిలో 3895వ ర్యాంకు సాధించాడు. విద్యార్థి తల్లిదండ్రులు చంటిబాబు, పావని రోజు కూలీ పనులు చేసుకుంటారు. విద్యార్థి కారుణ్యలో హైస్కూల్‌, ఇంటర్మీడియేట్‌ విద్య పూర్తి చేశాడు. కళాశాలలో ప్రత్యేక తర్ఫీదుతోనే ఈ విజయం సాధించానని, ఐఐటీలో సీటు రావడమే తన అదృష్టమని, ఎక్కడ సీటు వచ్చినా మెకానికల్‌ ఇంజినీర్‌ చేయడమే తన లక్ష్యమని విద్యార్థి దివాకర్‌ తెలిపాడు.

రోలుగుంట : కుసుర్లపూడి జెడ్పీ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి మేడపు రెడ్డి శ్యామ్‌ కుమార్‌ జేఈఈ ఆడ్వాన్స్‌డ్‌లో తన సత్తా చాటాడు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆల్‌ ఇండియాలో 11.265 ఓబీసీ ఎన్‌సిఎల్‌ ర్యాంకు 2,782 సాధించాడు. రైతు కుటుంబానికి చెందిన ఈ విద్యార్థి స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివి 560 మార్కులతో స్కూల్‌ టాపర్‌గా నిలిచాడు. ఇంటర్‌లో 980 మార్కులు సాధించి, ఈ ఏడాది జేఈఈ మెయిన్స్‌లో 99.59 పర్సేంటేజి సాధించాడు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో కూడా తన సత్తా చాటి గ్రామానికి, తాను చదువుకున్న పూర్వ పాఠశాలకు గుర్తింపు తీసుకురావడంపై కుసుర్లపూడి జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం శెట్టి మోహన్‌రావు, ఉపాధ్యాయులు శ్యామ్‌కుమార్‌ని అభినందించారు.

పాయకరావుపేట : జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో శ్రీ ప్రకాష్‌ జూనియర్‌ కళాశాల విద్యార్థి జె.మోనిష్‌కుమార్‌ ఓబీసీ కేటగిరిలో 167వ ర్యాంకు, జనరల్‌ కేటగిరిలో 974వ ర్యాంకు సాధించాడు. ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యాసంస్థల అధినేత నరసింహారావు, సంయుక్త కార్యదర్శి విజయ్‌ ప్రకాష్‌, ప్రిన్సిపాల్‌ భానుమూర్తి, ఉపాధ్యాయులు అభినందించారు.

ఎం.శ్యామ్‌ కుమార్‌

కాకినాడ దివాకర్‌

జె.మోనిష్‌కుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement