మాడుగుల రూరల్ : ఏపీ పీజీసెట్ 2026 ఫలితాల్లో మాడుగుల ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకు సాధించింది. కళాశాల బీఏ విద్యార్థిని చొక్కా ఏసుకుమారి రాజనీతి శాస్త్ర విభాగంలో(పోలిటికల్ సైన్సు)లో రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకు సాధించింది. వీరితో పాటు కళాశాలకు చెందిన బీఎస్సీ విద్యార్థిని నంబారు మౌనిక జువాలజీ విభాగంలో 155వ ర్యాంకు, చరిత్ర విభాగంలో మాదల మాధవి 228 ర్యాంకు, ఘట్టం తులసీ 265 ర్యాంకు, బీఎస్సీ విద్యార్థిని వంతల కొండమ్మ ఫిజికల్ సైన్సు విభాగంలో 252 ర్యాంకు సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ పి.జయ తెలిపారు.
ఏపీ ఎడ్‌సెట్‌లో ర్యాంకుల పంట
ఏపీఎడ్‌సెట్ 2026 ఫలితాల్లో కూడా కళాశాల విద్యార్థులు సత్తా చాటారన్నారు. కళాశాల బీఎస్సీ విద్యార్థినులు బయోలాజికల్ సైన్సు విభాగంలో నంబారు మౌనిక 721 ర్యాంకు, మాటూరి దుర్గాభవానీ 2041 ర్యాంకు, మధుమతి 3155 ర్యాంకు, కొర్రా కృష్ణవేణి 4482 ర్యాంకు, గెద్దన్నపల్లి అపర్ణ 2813 ర్యాంకు, సోషల్ స్టడీస్ విభాగంలో జె. విజయలక్ష్మి 3890 ర్యాంకు సాధించారన్నారు. కేంద్రీయ విద్యాలయాల ప్రవేశ పరీక్షలో ఏసుకుమారి పోలిటికల్ సైన్సు విభాగంలో 175 మార్కులు, బీఎస్సీ విద్యార్థిని పి.మల్లేశ్వరి ఇంగ్లిష్‌లో 91 మార్కులు సాధించారని తెలిపారు.


