ఎంపికై న క్రీడాకారులతో అసోసియేషన్ సభ్యులు
అచ్యుతాపురం రూరల్ : అండర్–18 రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలకు అనకాపల్లి జిల్లా క్రీడాకారుల ఎంపిక అచ్యుతాపురం భోగాపురం క్రీడా ప్రాంగణంలో సోమవారం జరిగింది. జిల్లా నలుమూలల వివిధ పాఠశాలలు, కళాశాలల నుంచి క్రీడాకారులు పాల్గొనగా స్టాండ్‌బైతో కలిపి 24 మందిని ఎంపిక చేసినట్టు నేషనల్ కోచ్ వెంకట్ తెలిపారు. జూన్ 6, 7 తేదీల్లో పల్నాడు జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు పాల్గొంటారన్నారు. ఎంపికై న క్రీడాకారులను అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు కూండ్రపు వెంకునాయుడు, అధ్యక్షుడు డాక్టర్ ఎస్.ఎన్.వి జగదీష్, వైస్ ప్రెసిడెంట్ రెడ్డి చిరంజీవి, అసోసియేషన్ సభ్యులు ధర్మిరెడ్డి వెంకట్, డాక్టర్ సుధీర్, కూండ్రపు రమేష్, శివాజీ, శ్రీను, శంకర్, రెహమాన్ అభినందనలు తెలిపారు.


