చోడవరం: ఓటర్ల జాబితా సవరణ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రివిజన్(ఎస్‌ఐఆర్)పై వైఎస్సార్ సీపీ బూత్ లెవెల్ ఏజెంట్లు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి,వైఎస్సార్‌సీపీ ఉభయ గోదావరి జిల్లాల కో ఆర్డినేటర్, చోడవరం సమన్వయకర్త గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఓటర్ల జాబితా సవరణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైఎస్సార్‌సీపీ పోలింగ్ బూత్ కమిటీలకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని చోడవరం పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఫారం–6,7తోపాటు ఇతర అంశాలను, జాబితాలో దొంగ ఓటర్లను ఎలా గుర్తించాలి, అర్హత ఉన్నప్పటికీ ఓటర్లను ఉద్దేశపూర్వకంగా ఎలా తొలగిస్తారు అనే విషయాలను లేజర్‌స్క్రీన్‌పై స్వయంగా అమర్‌నాఽథ్ బూత్ కమిటీలకు అవగాహన కల్పించారు. అర్హత ఉన్న ఓటర్లను తొలగించకుండా గ్రామాల్లోకి వస్తున్న సర్వే అధికారులతో కలిసి బూత్ ప్రతినిధులు పనిచేయాలని సూచించారు. ప్రతీ బూత్ ప్రతినిధి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. గ్రామస్థాయిలో పరిష్కారం కాని విషయాలను గుర్తిస్తే మండలస్థాయి, జిల్లా స్థాయి అధికారులకు పార్టీ కమిటీ ప్రతినిధులు ఫిర్యాదుచేసి సమస్య పరిష్కారానికి కృషిచేస్తాయాలన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై బూత్ ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు అమర్‌నాథ్ సమాధానాలు చెప్పి, వారి సందేహాలను నివృత్తి చేశారు.
ఏమరుపాటుగా ఉండొద్దు
మాజీ ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ ప్రతీ బూత్ ప్రతినిధి స్థానికంగా ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను కలుపుకొని నిజమైన ఓటర్లు తొలగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇప్పుడు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అది రాబోయే అన్ని ఎన్నికలపై ప్రభావం చూపుతుందని, ఈ విషయాన్ని అంతా గుర్తించి అంకితభావంతో పనిచేయాలని ముత్యాలనాయుడు సూచించారు.
ఉద్యమాన్ని విజయవంతం చేయాలి
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై వచ్చే నెల 4వ తేదీ నుంచి వైఎస్సార్‌సీపీ చేట్టనున్న ఉద్యమాన్ని అన్ని మండల, నియోజకవర్గాస్థాయిల్లో విజయవంతంగా నిర్వహించాలన్నారు. గతంలో ఎప్పుడూలేని విధంగా ఈ బూత్ కమిటీ శిక్షణ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో కార్యకర్తలు తరలి రావడంతో పార్టీకి మరింత ఊపు వచ్చింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటు పరిశీలకురాలు శోభా హైమావతి, నియోజకవర్గం పరిశీలకుడు గండి రవికుమార్, రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు, సంయుక్త కార్యదర్శి దొండా రాంబాబు, రాష్ట్ర బీసీసెల్ కార్యదర్శి పల్లా నర్సింగరావు,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కొళ్లిమళ్ల అచ్చెంనాయుడు, రాష్ట్ర యూత్ విభాగం సంయుక్త కార్యదర్శి గూనూరు రామచంద్రనాయుడు, యూత్ జిల్లా అద్యక్షుడు పుల్లేటి వెంకటేష్, రైతు విభాగం అధ్యక్షుడు నాగులాపల్లి రాంబాబు, చోడవరం, బుచ్చెయ్యపేట, రా వికమతం, రోలుగుంట మండలాల అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీలు, అనుబంధ కమిటీల రాష్ట్ర, జిల్లా కమిటీల ప్రతినిధులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
మాజీ మంత్రి అమర్‌నాథ్


