పతకాలు సాధించిన క్రైం కానిస్టేబుల్ గొర్లె శ్రీనివాసరావును అభినందిస్తున్న డీఎస్పీ శ్రావణి
అనకాపల్లి: విశాఖ ఉమ్మడి జిల్లా పోలీస్ యాన్యువల్ క్రీడాపోటీల్లో జిల్లాలో కశింకోట పోలీస్‌స్టేషన్‌లో క్రైమ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న గొర్లె శ్రీనివాసరావు 100, 200 మీటర్స్, డిస్కస్ త్రోలో బంగారు పతకాలు 400 మీటర్స్ లో కాంస్య పతకం,, జావిలిన్ , షార్ట్‌పుట్‌లో రజత పతకాలు సాధించారు. జిల్లా ఫాస్టెస్ట్ రన్నర్‌గా పోటీల్లో నిలిచారు. పోటీల్లో గెలుపొందిన గొర్లె శ్రీనివాసరావును స్థానిక కొత్తూరు డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ ఎం.శ్రావణి మంగళవారం అభినందించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రానున్న రోజుల్లో మరిన్ని పతకాలు సాధించాలని కోరారు. కార్యక్రమంలో సీఐ స్వామినాయుడు పాల్గొన్నారు.
దేవరాపల్లి: జిల్లా పోలీస్ వార్షిక గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌లో దేవరాపల్లి మండలంలో స్పెష ల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ విధులు నిర్వర్తిస్తున్న రెడ్డి మహేష్‌కుమార్ సత్తా చాటారు. విశాఖపట్నంలోని కై లా సగిరి సమీపంలోని ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ గ్రౌండ్‌లో మూడు రోజులుగా జరుగుతున్న పోలీస్ వార్షిక స్పోర్ట్స్ మీట్‌లో బ్యాడ్మింటన్‌లో సింగిల్, డబుల్స్‌లో రెండు గోల్డ్ మెడల్స్, కబడ్డీలో బ్రాంచ్ మెడల్ సొంతం చేసుకున్నారు. విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపీనాథ్ శెట్టి, ఎస్పీ తుహీన్ సిన్హా ఇతర పోలీస్ ఉన్నతాధికారుల చేతుల మీదుగా మహేష్‌కుమార్ పతకాలు, మెమెంటోలు అందుకున్నారు. మహేష్‌కుమార్‌ను పలువురు పోలీస్ అధికారులు, సహచర ఉద్యోగులు అభినందించారు.


