అంతిమయాత్రకు కష్టాలెన్నో... | - | Sakshi
Sakshi News home page

అంతిమయాత్రకు కష్టాలెన్నో...

Apr 2 2026 7:53 AM | Updated on Apr 2 2026 7:53 AM

బుచ్చెయ్యపేట: మేజర్‌ పంచాయతీ వడ్డాదిలో శ్మశానానికి వెళ్లేందుకు రహదారి సౌకర్యం లేక పలువురు అవస్థలు పడుతున్నారు. గ్రామంలో కొత్తూరు రెల్లివీధికి చెందిన కొత్తపల్లి రాజు అనారోగ్యంతో బుధవారం మృతి చెందాడు. వీరి శ్మశానం మెయిన్‌ రోడ్డును ఆనుకుని ఉన్న పెద్దేరు కస్పా కాలువ అవతల ఉంది. కాలువపై నుండి వెళ్లేందుకు రహదారి సౌకర్యం లేక కుటుంబ సభ్యులు రాజు మృతదేహంతో కాలువలోకి దిగి అవస్థలు పడ్డారు. మోకాళ్ల లోతు నీటిలో నుంచి దిగి శ్మశానానికి చేరుకుని దహన సంస్కారాలు పూర్తి చేశారు. ఎవరైనా మృతి చెందితే ఈ రోజుతో ఆయనకు కష్టాలు పోయాయి సంతోషంతో దహన సంస్కారాలు చేయాలంటారు. కానీ శ్మశానంకు వెళ్లే రహదారి సౌకర్యం లేక అంతిమయాత్రకు నానా కష్టాలు తప్పడం లేదని పలువురు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు గ్రామాల్లో అవసరం లేకపోయినా పంట పొలాలకు లే అవుట్‌లకు ప్రభుత్వ నిధులతో రోడ్లు వేస్తున్న అధికారులు అవసరం ఉన్న చోట మాత్రం రోడ్డు సదుపాయం కల్పించడం లేదని, నాయకులు ఎక్కడ చెబితే అక్కడే రోడ్లు వేస్తున్నారు తప్ప ప్రజాప్రయోజనాలు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement