నక్కపల్లి: మండలంలో అప్పలపాయకరావుపేట, నక్కపల్లి గ్రామాల్లో బుధవారం హోం మంత్రి వంగలపూడి అనిత సామాజిక భద్రతా పింఛన్లను పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ నేతన్నలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. దీనివల్ల కరెంటు బిల్లుల భారం నుంచి ఉపశమనం పొందవచ్చన్నారు. చేనేత కార్మికురాలితో కలిసి నక్కపల్లిలో మగ్గం నేశారు. వారి నుంచి చీర కొనుగోలు చేశారు. అనంతరం నక్కపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలసి మధ్యాహ్న భోజనం చేశారు. భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామున్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఏపీఐఐసీ పునరావాస కాలనీలో నిర్వాసితుల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కొప్పిశెట్టి వెంకటేష్, పీఏసీఎస్ పర్సన్ ఇన్‌చార్జ్ కొప్పిశెట్టి బుజ్జి, ఎంపీడీవో చైతన్య, నాయకులు పాల్గొన్నారు.


