అనకాపల్లి: గవరపాలెం నూకాంబిక అమ్మవారిని బుధవారం ఆధ్యాత్మిక ప్రవచన చక్రవర్తి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. అంతకుముందు ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణని ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను, ఆలయ సహాయ కవిమిషనర్ యాళ్ల శ్రీధర్‌లు పూర్ణకుంభంతో స్వాగతించారు. అనంతరం ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ చాగంటి కోటేశ్వరరావును శాలువాతో సత్కరించి, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం స్థానిక ఎన్టీఆర్ క్రీడామైదానంలో నూకాంబిక అమ్మవారి నెల పండగ జాతరలో భాగంగా కోటేశ్వరరావు ప్రవచనం చేశారు.


