తుమ్మపాల : కౌమార దశలో గర్భం దాల్చడం వల్ల కలిగే అనర్ధాలను వివరిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కలెక్టర్ విజయకృష్ణన్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ‘కౌమార దశలో గర్భధారణ – కారణాలు, దుష్ప్రభావాలు అవగాహన‘ గోడ పత్రికలను ఆమెతో పాటు జేసీ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో వై.సత్యనారాయణరావు ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ బాలికల విద్యను ప్రోత్సహించడం, అనుమానాస్పద సంఘటనలపై తక్షణమే అధికారులకు ఫిర్యాదు చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించగలమన్నారు. జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారి సూర్యలక్ష్మి, డీఎంహెచ్‌వో హైమావతి, సిబ్బంది పాల్గొన్నారు. జీరో పావర్టీ పీ4 తొలి వార్షికోత్సవాన్ని కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తిరుపతి పద్మావతీ మహిళా యూనివర్సిటీలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టరేట్‌లో నిర్వహించారు.


