ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం
ఎస్పీ తుహిన్ సిన్హా
ఖైదీలతో మాట్లాడుతున్న సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు
అనకాపల్లి టౌన్: ఖైదీలకు ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరావు తెలిపారు. స్థానిక సబ్ జైలును మండల లీగల్ సర్వీస్ ఆధ్వర్యంలో శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖైదీలు కోరితే న్యాయ సహాయం అందిస్తామన్నారు. ఈ సందర్భంగా ఖైదీలకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు.జైలు సూపరింటెండెంట్ కిరణ్ కుమా ర్, ఎంఎల్‌సీ ప్రతినిధి సంధ్య పాల్గొన్నారు.
సబ్‌జైల్‌ను సందర్శించిన సీనియర్ సివిల్ జడ్జి
నర్సీపట్నం: సీనియర్ సివిల్ జడ్జి పి.షియాజ్ ఖాన్ శనివారం స్థానిక సబ్‌జైలును సందర్శించారు. జైలు సిబ్బందిని ఖైదీల వివరాలను అడి గి తెలుసుకున్నారు. కేసుల వివరాలు, జైలులో అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సేవలు పొందవచ్చని తెలిపారు.
సైబర్ నేరాలపై అప్రమత్తం
అనకాపల్లి టౌన్: సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ తుహిన్ సిన్హా ఓ ప్రకటనలో తెలిపారు. సైబర్ నేరస్తులు కొత్త దారుల్లో ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. ట్రాఫిక్ చలాన్ల పేరుతో జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. మీ వాహనానానికి పెండింగ్‌చలానా ఉందని వెంటనే లింక్‌పై క్లిక్ చేసి చెల్లించకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అవుతుందని మెసేజ్ పంపిస్తున్నారని తెలిపారు. డిజిటల్ అరెస్ట్, మనీ లాండరింగ్ పేరిట భయపెట్టి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు. పార్ట్ టైమ్ జాబ్స్ పేరుతో డబ్బులు ఇస్తామని ఆశ చూపి మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఫోన్‌కి వచ్చే అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయవద్దని సూచించారు. పాన్, ఆధార్ కార్డ్ ఫొటోలను గుర్తు తెలియని వ్యక్తులకు షేర్ చేయవద్దన్నారు. ఎటువంటి సైబర్ మోసానికి గురైనా 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.
ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం


