స్పెల్ బీ రాష్ట్రస్థాయిలో కేజీబీవీ విద్యార్థికి ద్వితీ
కృష్ణారెడ్డి నుంచి ప్రశంసాపత్రం అందుకుంటున్న లక్ష్మీలావణ్య
మాకవరపాలెం: రాష్ట్రస్థాయి స్పెల్ బీ పోటీల్లో స్థానిక కసూర్బా విద్యార్థిని ద్వితీయ స్థానం కై వశం చేసుకుంది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మాసారపు లక్ష్మీలావణ్య శనివారం అమరావతిలో జరిగిన రాష్ట్రస్థాయి స్పెల్ బీ పోటీల్లో ద్వితీయస్థానం సాధించినట్టు ఎంఈవో మూర్తి తెలిపారు. స్టేట్ ఎస్‌సిఈఆర్టీ డైరెక్టర్ వి.కృష్ణారెడ్డి నుంచి పతకం, ప్రశంసాపత్రం అందుకున్నట్టు చెప్పారు. లక్ష్మీలావణ్యను ఎంఈవోలతోపాటు కేజీబీవీఎస్‌వో త్రివేణి, ఉపాధ్యాయులు అభినందించారు.


