పూడిమడక ... భక్తజన సంద్రం | - | Sakshi
Sakshi News home page

పూడిమడక ... భక్తజన సంద్రం

Feb 1 2026 3:21 AM | Updated on Feb 1 2026 3:21 AM

పూడిమడక ... భక్తజన సంద్రం

పూడిమడక ... భక్తజన సంద్రం

పూడిమడక ఉత్సవంలో పాల్గొన్న భక్తులు

అచ్యుతాపురం రూరల్‌ : పూడిమడక మాఘపౌర్ణమి జాగరణ తీర్థానికి భక్తులు పోటెత్తారు. జిల్లా నలుమూలల నుంచి శనివారం భక్తులు అధిక సంఖ్యలో తీరానికి చేరుకున్నారు.ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పరవాడ డీఎస్పీ విష్ణు స్వరూప్‌ ఆధ్వర్యంలో సీఐ చంద్రశేఖర్‌రావు, ఎస్‌ఐ సుధాకర్‌ పాటు 100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. తీరంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు, కబడ్డీ, వాలీబాల్‌ పోటీలు నిర్వహించారు. విద్యుత్‌ దీపాలంకరణతో గ్రామం దేదీప్యమానంగా వెలిగిపోయింది. మాఘపౌర్ణమి జాతరకు వచ్చిన భక్తులందరూ వేణు గోపాల లక్ష్మీ సమేత జగన్నాథ స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని ఉత్సవ కమిటీ సభ్యులు మేరుగు ప్రవీణ్‌, సూరాడ ధనరాజు, పొన్నమల్ల కొండబాబు, మేరుగు చిన్నారావు, కారి నూకరాజు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement