దివ్యాంగుల దివిటీ | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగుల దివిటీ

Dec 3 2025 7:57 AM | Updated on Dec 3 2025 7:57 AM

దివ్య

దివ్యాంగుల దివిటీ

పొట్నూరు సత్య తిరుపతిరావు పట్నాయక్‌.. పుట్టుకతోనే పోలియో బాధితుడు, వైకల్యం జీవితానికి ఆటంకం కాకూడదనే తన ఆలోచనతో పురుడు పోసుకుంది ఇంటిగ్రేటెడ్‌ వికలాంగుల ఆశ్రమ పాఠశాల. ఇక్కడ ఆశ్రయం పొందిన వందలాది మంది దివ్యాంగులు, నిరాశ్రయులు సరికొత్త జీవితాన్ని ప్రారంభించారు. సాఫ్ట్‌వేర్లుగా, ఉపాధ్యాయులుగా ఇలా వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. విభిన్న

గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌కు దివ్యాంగుల సమస్యలను విన్నవిస్తూ..

2006లో రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌ నుంచి అవార్డు పొందిన పట్నాయక్‌

అచ్యుతాపురం రూరల్‌: పుట్టుకతోనే పోలియో బాధితుడు.. వైకల్యం జీవితానికి ఆటంకం కాకూడదనే ఆలోచన.. తనలాంటి వారికి ఏదైనా చేయాలన్న తపన.. అవయవాలు సహకరించకపోయినా అధైర్యపడలేదు. ఆర్థిక వనరులు లేకపోయినా వెనుకడుగు వేయలేదు. ఎన్ని కష్టాలు, అవాంతరాలు ఎదురైనా ఆయన సంకల్ప బలం ముందు అవేవీ నిలవలేకపోయాయి. ఈ రోజు వందలాది మందికి సరికొత్త జీవితాన్ని ప్రసాదించారు పట్నాయక్‌ మాస్టార్‌. ఆరు పదుల వయసులోనూ తన ఆశయాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు.

వేదన నుంచి వెలుగుల వరకు..

యలమంచిలిలో 1967 ఫిబ్రవరి 16న సత్య తిరుపతిరావు పట్నాయక్‌ జన్మించారు. పోలియో బాధితుడైన పట్నాయక్‌ కాళ్లు వంగేవి కావు. ఐదో తరగతి చదువుతున్న సమయంలో విశాఖపట్నం కేజీహెచ్‌లో 1972–76 మధ్య కాలంలో ఐదు ఆపరేషన్లు చేసి నిటారుగా ఉండేలా చేశారు. వివిధ పాఠశాలల్లో తొమ్మిదో తరగతి వరకు చదివి, ఏఎంఏఎల్‌ కళాశాలలో మెట్రిక్యులేషన్‌ పూర్తి చేశారు. అప్పట్లో వాహనాల సౌకర్యం అంతగా లేని కారణంగా ఉన్నత విద్య చదవలేకపోయారు. ఆ తర్వాత 1994 ఫిబ్రవరి 18న అచ్యుతాపురంలో మండల వికలాంగుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లో తల్లిదండ్రులకు అవగాహన కల్పించి వికలాంగులు ఉన్నత విద్యావంతులు కావడానికి మార్గనిర్దేశం చేశారు. దీనికిగాను రాష్ట్రపతి అవార్డు వరించింది. ఉమ్మడి రాష్ట్రమంతటా పర్యటించి దివ్యాంగులకు మెడికల్‌ బోర్డు సర్టిఫికెట్లు మంజూరుకు కృషి చేశారు. వికలాంగుల పింఛన్ల కోసం 1995లో 15 రోజుల రిలే నిరాహార దీక్ష చేశారు. 1995–96లో 125 మంది వికలాంగులకు ఇళ్ల మంజూరుకు కృషి చేశారు.

ఇంటిగ్రేటెడ్‌ వికలాంగుల ఆశ్రమ

పాఠశాల ప్రారంభం

అచ్యుతాపురంలో 1998లో ఇంటిగ్రేటెడ్‌ వికలాంగుల ఆశ్రమ పాఠశాల (ఐవీఏ)ను అప్పటి కలెక్టర్‌ నర్సింగరావు ప్రారంభించారు. ఆనాడు పది మంది దివ్యాంగ విద్యార్థులతో ప్రారంభమై ప్రస్తుతం 2 వేల మందికిపైగా నిరాశ్రయులకు, అనాథలకు, దివ్యాంగులకు ఆశ్రయమిచ్చే స్థాయికి చేరుకుంది. 24 బ్యాచ్‌ల వరకూ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి తీర్చిదిద్దుతున్నారు. ఉచిత భోజన వసతి, వైద్యంతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ప్రభుత్వం గుర్తింపు పొందిన ఏకై క దివ్యాంగుల పాఠశాలగా రాష్ట్రంలోనే కీర్తినార్జించింది. ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్మీడియట్‌ ద్వారా చదివిస్తున్నారు. అనేక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆశ్రయం కల్పించి చికిత్సలు చేయించి విద్యనభ్యసింపజేస్తున్నారు. శ్రీ సత్యసాయి సేవా సమితి ఉక్కునగరం ప్రేమ ఆస్పత్రి సహకారంతో అనేక మందికి శస్త్ర చికిత్సలు చేయించారు. దివ్యాంగ విద్యార్థులకు పాఠశాలలో విద్యతోపాటు కూచిపూడి, భరతనాట్యం, యోగా, వంటివి నేర్పిస్తున్నారు. ఇప్పటికే కొన్ని వందలకుపైగా మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేసి దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు అందించారు. పీజీ వరకూ చదువుకునేందుకు ఐవీఏ పాఠశాల కేంద్రం కావాలని పట్నాయక్‌ ఆకాంక్షిస్తున్నారు. ఇందుకు దాతల సహకారం కావాలని కోరుతున్నారు. ఈయన సేవలను గుర్తించి అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా 2006 డిసెంబర్‌ 2న అప్పటి రాష్ట్రపతి ఎ.పి.జె.అబ్దుల్‌ కలామ్‌ రాష్ట్రపతి అవార్డు అందజేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు.

అభాగ్యుల పాలిట వరం ఇంటిగ్రేటెడ్‌

వికలాంగుల ఆశ్రమ పాఠశాల

వందలాది మందికి సరికొత్త జీవితం

సాఫ్ట్‌వేర్‌, ఉపాధ్యాయ రంగాల్లో

రాణింపు

దివ్యాంగులకు విద్యా ప్రదాత

పి.ఎస్‌.టి.పట్నాయక్‌

దివ్యాంగుల దివిటీ1
1/2

దివ్యాంగుల దివిటీ

దివ్యాంగుల దివిటీ2
2/2

దివ్యాంగుల దివిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement