జాతీయ స్థాయి బేస్‌బాల్ పోటీలకు ఎంపిక
మాకవరపాలెం: జాతీయ స్థాయి బేస్‌బాల్ పోటీలకు మాకవరపాలెం ఉన్నత పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నంద్యాలలో ఆదివారం జరిగిన రాష్ట్ర స్థాయి బేస్‌బాల్ పోటీల్లో ఈ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. అండర్–17 బాలుర విభాగంలో మాకవరపాలెం ఉన్నత పాఠశాలకు చెందిన తులసిరాజ్, రాజేష్, బాలికల విభాగంలో భువనేశ్వరి తమ ప్రతిభను కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని హెచ్‌ఎం నారాయణరావు సోమవారం తెలిపారు. త్వరలో ఢిల్లీలో జరగనున్న పోటీల్లో పాల్గొననున్న ఈ విద్యార్థులను హెచ్‌ఎంతో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు డి.రవి, చంద్రదేవి, ఇతర ఉపాధ్యాయులు అభినందించారు.


