గురజాడకు ఘన నివాళి
గురజాడ విగ్రహానికి పూలమాల వేసి
నివాళులర్పిస్తున్న ఎంపీపీ తదితరులు
గురజాడ వర్ధంతిని పురస్కరించుకుని
చిన్నారుల నృత్యాలు
ఎస్.రాయవరం: మహాకవి గురజాడ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలని ఎంపీపీ కేసుబోయిన వెంకటలక్ష్మి అన్నారు. గురజాడ వర్ధంతిని పురస్కరించుకుని ఎస్.రాయవరంలో గురజాడ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గురజాడ జన్మస్థలమయిన ఎస్.రాయవరంలో గురజాడ వర్ధంతిని ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించాలని, గురజాడ రచనలు, నాటికలు నవ సమాజానికి తెలిసేలా ఎస్.రాయవరంలో మ్యూజియం ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా గురజాడ ఫౌండేషన్ సభ్యులు సాయంత్రం గ్రామంలో చిన్నారులతో నృత్య కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వైస్ ఎంపీపీ బొలిశెట్టి గోవిందరావు, జెడ్పీటీసీ కాకరదేవి, స్థానిక నాయకులు సోమిరెడ్డి రాజు, కుర్రా కాశి, కొణతాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
గురజాడకు ఘన నివాళి


