ఎస్పీ కార్యాలయానికి 60 అర్జీలు
అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్‌కు 60 అర్జీలు వచ్చాయి. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలపై ఎస్పీ తుహిన్ సిన్హాకు విన్నవించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ వారం వచ్చిన ఫిర్యాదుల్లో భూ తగాదాలు–26, కుటుంబ కలహాలు–3, మోసానికి సంబంధించిన –2, వివిధ విభాగాలకు చెందినవి–29 మొత్తం 60 అర్జీలు వచ్చాయన్నారు. చట్టపరిధిలో సమస్యలను వారం రోజుల్లో విచారణ పూర్తి చేసి పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.


