గంగమ్మతల్లీ...నీవే దిక్కు...!
బల్క్‌డ్రగ్ పార్క్‌ను అడ్డుకోవాలంటూ మత్స్యకారుల మొర
నక్కపల్లి: ఏపీఐఐసీ రాజయ్యపేటలో ఏర్పాటు చేస్తున్న బల్క్ డ్రగ్‌పార్క్ రద్దు చేయాలంటూ మత్స్యకారులు చేస్తున్న నిరాహరదీక్ష 61వ రోజుకు చేరుకుంది. ఓట్లేసి గెలిపించిన మంత్రి అనిత తమ కోరిక మన్నిస్తారని ఎదురు చూశారు. కలెక్టర్‌పై ఆశలు పెట్టుకున్నారు. నా చేతుల్లో ఏమీ లేదని ఆమె చేతులెత్తేసారు. ఇక మమ్మల్ని ఆదుకునే దిక్కెవరు అంటూ గంగపుత్రులంతా గురువారం తమ ఆరాధ్య దైవం నూకతాత, తాము నమ్ముకున్న గంగమ్మ తల్లికి మొర పెట్టుకున్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా తీరం వద్దకు వెళ్లి గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వ మెడలు వంచి బల్క్‌డ్రగ్‌పార్క్ ఏర్పాటు కాకుండా అడ్డుకోవాలంటూ నూకతాత ఆలయం వద్ద, తీరంలోను ప్రత్యేక పూజలు నిర్వహించారు.


