
భారీ పోలీసు బందోబస్తు
మాకవరపాలెం: మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మండలంలోని భీమబోయినపాలెం వద్ద మెడికల్ కళాశాల భవనాల సందర్శనకు జగన్ రావడంతో సుమారు 800 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. గురువారం ఉదయం 6 గంటల నుంచే పోలీసులు భారీగా మెడికల్ కళాశాల ప్రాంతానికి చేరుకున్నారు. కళాశాలకు వెళ్లే మార్గంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాహనాలను లోనికి వెళ్లకుండా నిలిపివేశారు. మధ్యాహ్నం జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మెడికల్ కళాశాల భవనాల వద్దకు చేరుకుని భద్రత ఏర్పాట్లు పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

భారీ పోలీసు బందోబస్తు