
కార్యకర్తలకు అండగా డిజిటల్ బుక్
దేవరాపల్లి: కూటమి ప్రభుత్వం అరాచకాలతో అన్యాయానికి, వేధింపులకు గురవుతున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు డిజిటల్ బుక్ అండగా నిలుస్తుందని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు బూడి ముత్యాలనాయుడు అన్నారు. తారువలో సోమవారం స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్‌ను ఆయన ఆవిష్కరించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించే వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు నమోదు చేసి కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని, బాధితులందరికీ అండగా నిలిచేందుకే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిజిటల్ బుక్‌ను అందుబాటులోకి తెచ్చారన్నారు. ఈ డిజిటల్ బుక్‌లో దౌర్జన్యాలు, వేధింపులకు పాల్పడే వారి పేర్లతో పాటు బాధితుల వివరాలను, జరిగిన నష్టాన్ని పొందుపరిచేందుకు వీలుంటుందన్నారు. ప్రతి కార్యకర్త ఈ బుక్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వేధింపులకు పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టి తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు కర్రి సత్యం, వైస్ ఎంపీపీ పంచాడ సింహాచలంనాయుడు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వరదపురెడ్డి లలితానాయుడు, జిల్లా ఆర్టీఐ విభాగం అధ్యక్షుడు కె.వి.రమణ, పార్టీ మండల అధ్యక్షుడు బూరె బాబూరావు, యువజన విభాగం అధ్యక్షుడు కర్రి సూరినాయుడు, ఉపాధ్యక్షుడు బండారు దేముడునాయుడు, ప్రధాన కార్యదర్శి గూడెపు రాము, సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడు గంగవంశం సంతోష్, ఎంపీటీసీ పోతల వెంకటరావు పాల్గొన్నారు.
అన్యాయానికి గురైన వైఎస్సార్‌సీపీ శ్రేణులు సద్వినియోగం చేసుకోవాలి
మాజీ డిప్యూటీ సీఎం
బూడి ముత్యాలనాయుడు
తారువలో డిజిటల్ బుక్
క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ