
‘తాచేరు’ మరణాలు ప్రభుత్వ హత్యలే
● పేట డైవర్షన్ రోడ్డు, మిగిలిన రోడ్లు బాగు చేయకపోతే ప్రజా ఉద్యయం
● వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్
బుచ్చెయ్యపేట: తాచేరు నదిలో కాలుజారి కొట్టుకుపోయి ఇద్దరి మృతికి ప్రభుత్వమే కారణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. ఇటీవల భీమునిపట్నం, నర్సీపట్నం (బీఎన్) ఆర్‌అండ్‌బీ రోడ్డులో విజయరామరాజు పేట వద్ద వర్షాలకు కోతకు గురైన తాచేరు డైవర్షన్ రోడ్డు నదిలో కాలు జారి వడ్డాదికి చెందిన రైతు కాళ్ల సుబ్బారావు, పేట గ్రామానికి చెందిన 8వ తరగతి విద్యార్థి ఆడారి రోహిత్ కుటుంబ సభ్యులను ఆయ న స్థానిక నాయకులతో కలిసి సోమవారం పరామ ర్శించారు. స్ధానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ డైవర్షన్ రోడ్డు దెబ్బతినడం వల్ల విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల ప్రజ లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం నిర్ల క్ష్యం వహించిందన్నారు. రోడ్డును రెండు నెలల పాటు బాగు చేయకపోవడంతో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి, వ్యవసాయ చేసుకుంటున్న రైతు రైతు తాచేరు నదిలో కొట్టుకుపోయి మృత్యువాత పడ్డారన్నారు. పోయిన ప్రాణాలను ఈ ప్రభుత్వం తీసుకురాగలదా? అని ప్రశ్నించారు. ఇవి ముమ్మా టికీ ప్రభుత్వ హత్యలేనని, బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని అన్నారు. విజయరామరాజుపేట తాచేరు డైవర్షన్ రోడ్డును బాగుచేయాలని తమ పార్టీ తరపున నాయకులతో కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో డైవర్షన్ రోడ్డు పనులు చేపట్టారన్నారు. పేట, వడ్డాది వంతెనలతో పాటు దెబ్బతిన్న బీఎన్ రోడ్డు, ఆర్‌టీ రోడ్డు, వడ్డా ది నుంచి ఘాట్‌రోడ్డుకు వెళ్లే రోడ్డు పనులు చేపట్టకపోతే ప్రజలతో కలిసి ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. జెడ్పీటీసీ దొండా రాంబాబు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ కోవెల జనార్దనరావు, వైస్ ఎంపీపీలు దొండా లలితా నారాయణమూర్తి, గొంపా చినబాబు, పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.