
సేంద్రియ ఉత్పత్తులను వినియోగించండి
తుమ్మపాల: రసాయన ఎరువులు వాడకుండా సహజ సిద్ధంగా పండించే సేంద్రియ పంటల ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో అమృతపాల ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ–(సబ్బవరం) ఏర్పాటు చేసిన సేంద్రియ వ్యవసాయోత్పత్తుల స్టాల్‌ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిమితికి మించి రసాయన ఎరువుల వాడకం, ఆ ఉత్పత్తుల వినియోగం వల్ల పర్యావరణం, మనిషి ఆరో గ్యం ప్రభావితమవుతున్నాయన్నారు. సేంద్రియ వ్యవసాయోత్పత్తులకు మార్కెంటింగ్ సదుపాయం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవ సాయ అధికారి మోహనరావును ఆదేశించారు.