
బొడ్డేడను సత్కరించిన పార్టీ నేతలు
మునగపాక : వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్‌ను పలువురు పార్టీ నేతలు ఘనంగా సత్కరించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల క్రితం ప్రసాద్‌ను అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించిన విషయం తెలిసిందే. ఈమేరకు పార్టీ నేతలను కలిసి ప్రసాద్ ఆశీర్వాదాలు తీసుకున్నారు. మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, మాజీ ఎమ్మెల్యే యు.వి.రమణమూర్తిరాజు, నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీలను ప్రసాద్ మర్యాద పూర్వకంగా కలిసి ఆశీస్సులు అందుకున్నారు. యలమంచిలి ఎంపీపీ బోదెపు గోవింద్ తన అనుచరులతో కలిసి ప్రసాద్‌కు పూలమాల వేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడు, పార్టీ నేతలు కాండ్రేగుల నూకరాజు, దాసరి అప్పారావు,నరాలశెట్టి సూర్యనారాయణ, మద్దాల వీరునాయుడు, మొల్లేటి శంకర్, కోనపల్లి రామ్మోహనరావు, మొల్లేటి వినోద్, ఆడారి కాశీబాబు, పిన్నమరాజు రవీంద్రరాజు, కాండ్రేగుల జగన్, బొడ్డేడ బుజ్జి, మురళి, రామకృష్ణ, ఇందల నాయుడు పాల్గొన్నారు.