
వైద్య కళాశాలల ప్రైవేటుపరం అన్యాయం
తుమ్మపాల: ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయడం తీవ్ర అన్యాయమని, ప్రభుత్వం తక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక్కుతీసుకోవాలంటు అనకాపల్లి కోర్టు న్యాయవాదులు కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన కార్యక్రమంలో అనకాపల్లి బార్ అసోసియేషన్ ప్రతినిధులు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. వైఎస్సార్‌సీపీ లీగల్‌సెల్ జిల్లా ప్రెసిడెంట్ ఆడారి స్వామి మాట్లాడుతూ పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలను ప్రైవేటు చేయడం, పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడమేనన్నారు. పేద విద్యార్థుల తల్లిదండ్రుల తరపున బాధ్యతగా తమ నిరసన తెలుపుతున్నామని, ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలను అమలు చేసే ముందు ప్రజల మనోభావాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు దీవాకర్, యుగంధర్, జగపతి, రమేష్, మల్లేష్ పాల్గొన్నారు.