
నేరుగా వాయిస్ మెసేజ్‌లు ఉన్నా...
‘‘ఈ నెల 10వ తేదీలోగా నా వద్దకు వచ్చి... కన్ఫర్మ్ చేసుకోండి. 10వ తేదీన జాబితా సిద్ధమవుతుంది. 11వ తేదీ నుంచి ఎవరైనా పట్టుకుంటే నాకు సంబంధం లేదు. ఫోన్ పేలు ఎవ్వరూ చేయవద్దు’’ ఇది అనకాపల్లి జిల్లాలో అధిక లోడుతో వెళుతున్న, అనుమతి లేని వాహనాల విషయంలో వసూళ్లకు సంబంధించిన ఆడియో మెసేజ్. ఈ ఆడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అసలు ఏ శాఖకు సంబంధం లేని ఒక ప్రైవేటు వ్యక్తి ధైర్యంగా ట్రాన్స్‌పోర్టు యాజమాన్యాలకు ఆడియో మెసేజ్‌లు పంపి వసూళ్లకు తెగబడుతున్నాడంటే... సదరు వ్యక్తికి ఎంతమేర అధికారుల నుంచి అండదండలున్నాయో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి ప్రతి నెలా లారీకి ఇంత చొప్పున అటు మైనింగ్, ఇటు ఫ్లై యాష్.... అంతేకాకుండా సెజ్‌లకు వెళ్లే బస్సుల యాజమాన్యాలు రవాణాశాఖ అధికారులకు పైకం చెల్లించాలి. లేని పక్షంలో దాడులు చేసి కేసులు నమోదు చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. ఈ వ్యవహారమంతా ఒక ప్రైవేటు వ్యక్తి ద్వారా రవాణాశాఖ అధికారులు నడిపిస్తున్నారనే విమర్శలున్నాయి.