
జీఎస్‌టీ సంస్కరణలపై విస్తృత ప్రచారం
తుమ్మపాల: జీఎస్‌టీ సంస్కరణలు, వాటి ప్రయోజనాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల అధికారులు, మండల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. నాలుగు శ్లాబ్‌లున్న జీఎస్‌టీ పన్ను విధానాన్ని రెండు శ్లాబ్‌లకు కుదించినట్టు తెలిపారు. 12 శాతం శ్లాబ్‌లో ఉన్న 99 శాతం వస్తువులు, సేవలను 5 శాతానికి తగ్గించినట్టు చెప్పారు. 28 శాతం శ్లాబ్‌లో గల 90 శాతం వస్తువులు,సేవలను 18 శాతానికి తగ్గించినట్టు ఆమె తెలిపారు. ఈ నెల 25 నుంచి అక్టోబర్ 19 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఎగ్జిబిషన్లు, ర్యాలీలు, మేళాలు, మండల, గ్రామస్థాయిలో సభలు నిర్వహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టరు ఎం. జాహ్నవి తదితరులు పాల్గొన్నారు.