
రూ.1.55 లక్షలకు లడ్డూ వేలం
చీడికాడ: అర్జునగిరి గ్రామంలో దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వరాహ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో భవానీ భక్తులు ఏర్పాటు చేసిన శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని ప్రతిష్టించారు. అమ్మవారి లడ్డును గ్రామానికి చెందిన కొప్పాక శ్రీనివాసరావు దంపతులు లక్షా 55 వేల రూపాయలకు వేలంలో సొంతం చేసుకున్నారు. ఈ నగదును వచ్చే ఏడాది జరిగే శరనవరాత్రి ఉత్సవాల్లో అంబలం పూజకు వినియోగించనున్నట్టు అమ్మవారి పీఠం గురు భవానీ భక్తులు తెలిపారు. కాగా అమ్మవారి అంబలం పూజ బుధవారం రాత్రి జరిగింది. భక్తుల ఆర్థిక సహకారంతో 50 కిలోల లడ్డూను ఏర్పాటు చేశారు.